ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి సమావేశాన్ని బహిష్కరించిన జర్నలిస్టులు…కారణం ఏంటంటే..?

by Kalyani |
ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి సమావేశాన్ని బహిష్కరించిన జర్నలిస్టులు…కారణం ఏంటంటే..?
X

దిశ, హుస్నాబాద్ ; పట్టభద్రుల బలం... గలం ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా శనివారం హుస్నాబాద్ పట్టణం తిరుమల గార్డెన్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అసలు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నదా? లేక యూత్ కాంగ్రెస్ నాయకులు నిర్వహిస్తున్నదా? అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమం పై విలేకరులకు కనీస సమాచారం లేదు. పోగా వెళ్లిన విలేకరులకు కూర్చోవడానికి కుర్చీలు లేకుండా నిలబెట్టడంతో జర్నలిస్టులు సమావేశాన్ని బహిష్కరించారు. ఆత్మీయ సమ్మేళనమని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమావేశంలో సమయపాలన పాటించకుండా లేటుగా వచ్చారు. రెండు గంటల ఆలస్యంగా సభ ప్రారంభమైనప్పటికీ సహనంతో వేచి ఉన్న జర్నలిస్టుల మనోభావాలను దెబ్బ తీస్తూ వారికి కనీసం విలువ ఇవ్వకుండా ప్రవర్తించిన తీరుతో జర్నలిస్టులు ఒకింత అసహనానికి గురై సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని తెలిపారు. అలాగే ఫ్లెక్సీలలో తమ పేర్లు లేవంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులను నిలదీశారని సమాచారం.

Advertisement
Next Story