మరోసారి మోడీ అధికారం చేపట్టడం ఖాయం

by Disha Web Desk 15 |
మరోసారి మోడీ అధికారం చేపట్టడం ఖాయం
X

దిశ, వర్గల్ : కేంద్రంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పేర్కొన్నారు. వర్గల్ మండల బీజేపీ అధ్యక్షులు టేకులపల్లి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన్ని సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. దేశంలో శాంతి, సుస్థిరత బీజేపీతోనే సాధ్యపడుతుందని,

అధికారం కోసం జట్టు కట్టిన ఇండియా కూటమితో కష్టాలు తప్పవని స్పష్టం చేశారు. దేశంలో అవినీతి రహిత పాలన అందించిన బీజేపీ పేద వర్గాలకు చేరువైందని, మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటుందని చెప్పారు. మెదక్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ ఖాతాలో వేసి ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇద్దామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్, నాయకులు ప్రసాదరావు, వెంకట్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, కుడిక్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story