సహకరించనిది కేంద్ర ప్రభుత్వమా.. రాష్ట్ర ప్రభుత్వమా: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
సహకరించనిది కేంద్ర ప్రభుత్వమా.. రాష్ట్ర ప్రభుత్వమా: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కల్గించాయని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ప్యాక్టరీ, విభజన హామీలు, కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇలా తెలంగాణకు కేంద్ర ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరు దొంగె దొంగా అన్నట్లుగా ఉందన్నారు. రైతుల బావుల వద్ద మీటర్ల పెట్టాలని రాష్ట్రానికి రావల్సిన రూ.30 వేల కోట్లు అపింది కేంద్ర ప్రభుత్వం కాదా అని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజన్ పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో నేటికి 20 లక్షల అయిల్ ఇంజన్ లతో రైతులు వ్యవసాయం సాగిస్తున్నారని తెలిపారు.

మహరాష్ట్ర సోలాపూర్ లో నేటికి నాలుగు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, రూ.2 వేల ఫించన్ లాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాయ మాటలు నమ్మోద్దని, కళ్ల ముందు జరిగిన అభివృద్ధి చూసి ఆశీర్వదించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా సీఎం కేసీఆర్ సారద్యంలోని ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కాళ్వేశ్వరం ప్రాజెక్టును నిర్మించి మండుటెండల్లో చెరువులను మత్తడి దుంకిస్తూ రెండు పంటలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎరువుల కోసం లైన్లు, వ్యవసాయానికి విద్యుత్ కోసం ఎదురుచూపులు లేకుండా రైతుబంధు, రైతుబీమా అందజేస్తూ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండగగా మార్చారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. సిద్దిపేటను విద్యక్షేత్రంగా తీర్చిద్దుకోవడంతో పాటుగా, ప్రభుత్వ అసుపత్రిలో త్వరలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకరానున్నట్లు తెలిపారు.

సిద్దిపేట ప్రజల అధరాభిమాలు చూస్తుంటే చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కవే అని మంత్రి హరీష్ రావు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి రామచందర్ రావు, జడ్పీటీసీ కోటగిరి శ్రీహరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎర్ర యాదయ్య, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed