గ్రూప్స్, పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

by Disha Web Desk 22 |
గ్రూప్స్, పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : గ్రూప్స్, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు టీఎస్ఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ కు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కవిత ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1, 2, 3, 4, ఎస్ ఎస్ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ ఎస్సై, కానిస్టేబుల్ తదితర రాష్ట్ర, కేంద్ర స్థాయి ఉద్యోగార్థులకు టీ‌ఎస్‌ఎస్ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు ద్వారా ఐదు నెలల పాటు ఉచిత శిక్షణను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కుల, ఆదాయం, పదవ తరగతి, డిగ్రీ, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో మార్చి 6 తేదీ వరకు ఆన్లైన్ (www.tsstudycircle.co.in) లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మార్చి 7 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 10వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు వచ్చిన మెరిట్ ఆధారంగా శాతం 75 శాతం ఎస్సీలకు, 15 శాతం బీసీలకు, 10 శాతం ఎస్టీలకు, ఇందులో 33 శాతం మహిళలకు, ఐదు శాతం అంగవైకల్యం కలవారికి సీట్లు కేటాయించబడతాయన్నారు. మార్చి 18 నుంచి తరగతులు ఐదు నెలల పాటు జరుగుతాయని తెలిపారు.


Next Story

Most Viewed