నవోదయలో 9,11, తరగతుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

by Kavitha |
నవోదయలో 9,11, తరగతుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, వర్గల్ : మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9,11, తరగతులలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2024 - 2025 విద్యా సంవత్సరం ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదవాలని, 01-05-2010 నుండి 31-07-2012 తేదీల మధ్యలో జన్మించి ఉండాలని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉచితంగా www.navodaya.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష 08-02-2025 రోజున నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డి. రాజేందర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed