ఈనెల 14 వరకు... సీటీ పోలీస్ యాక్ట్ అమలు

by Disha Web Desk 22 |
ఈనెల 14 వరకు... సీటీ పోలీస్ యాక్ట్ అమలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 వరకు సీటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. బంద్‌ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. దీనికి తోడు కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు ఈనెల 14 వరకు అమలులో ఉంటుందన్నారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని సీపీ శ్వేత హెచ్చరించారు.Next Story