డబుల్ ఇంజన్ పాలన వస్తే తెలంగాణలోనూ కర్ణాటక పరిస్థితే : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk |
డబుల్ ఇంజన్ పాలన వస్తే తెలంగాణలోనూ కర్ణాటక పరిస్థితే : మంత్రి హరీష్ రావు
X

దిశ , జహీరాబాద్: డబుల్ ఇంజన్ సర్కార్ పాలిత రాష్ట్రాల కంటే కంటే సీఎం కేసీఆర్ పాలనే అభివృద్ధి, సంక్షేమం తదితర అన్ని కార్యక్రమాల్లో బెటర్ అని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర రైతులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై కర్ణాటక పాలనపై సరిపోల్చుతూ సబికుల్లో చైతన్యం కల్పించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తమకు కర్ణాటక పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా 10.5 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు భవనాలు, అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా జహీరాబాద్ పట్టణంలో మాత శిశు కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొడంపల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల, కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అందిస్తున్న ప్రజా, రైతు సంక్షేమ పథకాలు ఏవి అక్కడి ప్రజలకు అందడం లేదన్నారు. ఒకవేళ ఏమరపాటుగా ఉంటే తమ పరిస్థితి కూడా కర్ణాటక ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితి దాపరిస్తుందని మంత్రి హెచ్చరించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. మొగుడంపల్లి రోడ్డు కవతల ఉన్న కర్ణాటకలోని కర్కనెల్లి, బొంగురులతోపాటు చించోళిల్లో అందుతున్న సంక్షేమ పథకాల గురించి స్థానికులను చైతన్యపరిచారు. వారికి నెల నెల తమలాగా రూ.2016 పింఛన్లకు బదులు రూ.600 వస్తుందని, చించోళి, బంగూరులలో తమలాగా ఇంటింటికి నల్ల నీరు రావడంలేదని తెలిపారు. అదేవిధంగా కర్ణాటక రైతులకు బావులు, బోర్లకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కర్ణాటక రైతులకు కేవలం ఐదారు గంటలు మాత్రమే కరెంట్ రావడంతో తాగు, సాగునీటికి వారు అనేక కష్టాలు పడుతున్నారన్నారు. ఆ పరిస్థితులు తమకు వద్దనుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ను తిప్పి కొట్టాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ కంటే కేసీఆర్ పాలని మెరుగైందన్నారు. ఇన్ని రకాలుగా తమ సంక్షేమాన్ని కోరుకుంటున్న కేసీఆర్‌ను ఆజన్మాంతం మరువద్దని కోరారు. సంవత్సరానికి రూ.10వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.57,882 కోట్ల రైతుబంధును ఇస్తుండగా రూ.51,800 కోట్ల పింఛన్లు ఇస్తున్నామన్నారు.

మెరుగైన విద్యా, వైద్యం అందిస్తున్నాం

జహీరాబాద్ పట్టణంలో 50 పడకల మాత శిశు కేంద్రానికి శంకుస్థాపన, అదేవిధంగా కోహీర్ మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా ఆస్పత్రిలో ఉచిత కాన్పు చేసి, కేసీఆర్ కిట్టిచ్చి క్షేమంగా ఇంటి వరకు పంపిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసే అన్నారు. అప్పట్లో కేవలం 91 గిరిజన గురుకుల పాఠశాలలు ఉంటే ప్రస్తుతం 183 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 298 గురుకుల పాఠశాలలు ఉంటే ప్రస్తుతం 980 ఉన్నాయన్నారు. ఆయా పాఠశాలలో 4.5 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారన్నారు. గురుకులాల్లో చదువుకొని డాక్టర్లు , ఇంజనీర్లు అయ్యారన్నారు. గురుకులలో చదివే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రూ.1 లక్ష ఖర్చు చేస్తున్నామన్నారు. మొగుడంపల్లి మండలానికి అదనంగా మరో రూ.1 కోటి మంజూరు చేస్తున్నట్లు మంత్రి పేరు ప్రకటించారు. మంత్రి ప్రకటనపై జడ్పీటీసీ సభ్యులు అరుణ మోహన్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సభాధ్యక్షులు ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, ఎంపీ. బీబీ.పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డిలు మాట్లాడుతూ కేసీఆర్ హాయంలోనే గిరిజనులకు న్యాయం జరిగిందన్నారు. సేవాలాల్ జయంతిని జాతీయస్థాయిలో నిర్వహించాలని సీఎం సూచనలు మేరకు పార్లమెంటులో ప్రస్తావించానన్నారు. ప్రతి తండాను పంచాయతీగా మార్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. పంచాయతీల అభివృద్ధి నిధులు ఇచ్చారన్నారు. విద్య వైదరంగంలో కార్పొరేట్‌లో ‌ లేని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నియోజకవర్గంలో రూ.130కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఈ సమావేశంలో హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎంపీపీ అంజమ్మ, నాయకులు కుతుబుద్దీన్ , శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, ఎంజి.రాములు, విజయకుమార్, డాక్టర్. చంద్రశేఖర్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, నాయకులు శంకర్ నాయక్, కిషన్ పవర్, మొహమ్మద్ తన్వీర్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed