పార్టీ మారను.. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా

by Disha Web Desk 22 |
పార్టీ మారను.. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా
X

దిశ , జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఖండించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఇకముందు కూడా అదే పార్టీలో కొనసాగుతానన్నారు. 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిన , 2019, 2023లో గెలిచిన పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. తనపై అపారమైన నమ్మకం ఉంచి 2023లో మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హారీష్ రావు ఎంతో సహకరించారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. వారికి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని చెప్పారు.


Next Story

Most Viewed