బీఆర్‌ఎస్ కౌన్సిలర్ మామిడ్ల ఇంటి ముట్టడి

by Disha Web Desk 22 |
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ మామిడ్ల ఇంటి ముట్టడి
X

దిశ, మెదక్ ప్రతినిధి: కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పై మామిళ్ల ఆంజనేయులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ఇంటిని ముట్టడించి బైఠాయించారు. బీ‌ఆర్‌ఎస్ కౌన్సిలర్ చేసిన వ్యాఖ్యల పై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు మామిళ్ల ఆంజనేయులు ఇంటి ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ రాజేష్, పట్టణ, రూరల్ సీఐలు చేరుకుని వారికి నచ్చజెప్పారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఆందోళనలు చేయడం సరికాదని, ఏదైనా ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు.

దీంతో ఆందోళన విరమించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు జీవన్ రావు, బొజ్జ పవన్‌లు మాట్లాడుతూ…. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుల పై మెదక్ వైస్ రాయ్ గార్డెన్‌లో జరిగిన బీ‌ఆర్‌ఎస్ మీటింగ్‌లో మమిళ్ల ఆంజనేయులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వ్యక్తిగతంగా దూషించడం మాకు వచ్చని, కానీ మీలా సంస్కారం లేకుండా మాట్లాడం అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మంచి ప్యాకేజీ రావాలన్న ఉద్దేశ్యంతో ఆంజనేయులు బీఆర్‌ఎస్ నేతల ముందు కాంగ్రెస్ నేతలను తిడితే వస్తుందన్న ఉద్దేశ్యంలో మైనం పల్లి పై ఆరోపణలు చేశారని విమర్శించారు. 26 ఏళ్ల యువకుడిపై ఓడిపోయిన బీ‌ఆర్‌ఎస్ నేతలకు సిగ్గు రాలేదన్నారు. పదేళ్ల అధికార అహంకారం ఆ నేతల్లో ఇంకా తగ్గలేదని విమర్శించారు. ప్రజల కోసం కృషి చేస్తున్న మైనంపల్లి కుటుంబం పై ఆరోపణలు చేసిన ఆంజనేయులు క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయ పరంగా పోరాటం చేసి చర్యలు తీసుకునే వరకు ఊరుకోమని హెచ్చరించారు.


Next Story

Most Viewed