- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోకిరి చేష్టలు.. గ్రామ సభను అడ్డుకునే యత్నం
సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలో ఈనెల 10న పెద్ద ఎత్తున గ్రామసభ నిర్వహిస్తున్నారు.

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలో ఈనెల 10న పెద్ద ఎత్తున గ్రామసభ నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ సభకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు పోలీస్ శాఖ డీజీ మహేష్ భగవత్, జిల్లా ఎస్పీ పంకజ్, ఏఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు పాల్గొననున్నారు. అయితే ఈ గ్రామ సభ నిర్వహణ కోసం స్థానిక ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేశారు. అయితే నిన్న రాత్రి కొందరు యువకులు పాఠశాల ప్రాంగణంలో ఉన్న మిషన్ భగీరథ నీటి పైపులైను వాల్ ను ఎవరూ లేని సమయంలో కావాలనే విప్పి వెళ్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభ విజయవంతంగా జరగకుండా అడ్డుకోవాలనే కొందరు కక్షపూర్వకంగానే ఇలాంటి చర్యలకు దిగినట్లు స్థానిక సర్పంచ్ హరి ప్రసాద్ మండిపడ్డారు. పాఠశాల ప్రాంగణం నీటితో నిండి బురదమయం కావడంతో సర్పంచ్ హరిప్రసాద్ మొరం తెప్పించి అక్కడ కావాల్సిన లెవెలింగ్ పనులను దగ్గర ఉండి చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం గ్రామ సభ ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ఇతర అధికారులు పరిశీలించారు.






