దంచికొట్టిన వర్షం.. తడిసి ముద్దైన ధాన్యం

by Disha Web |
దంచికొట్టిన వర్షం.. తడిసి ముద్దైన ధాన్యం
X

దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించి ధాన్యాన్ని అమ్ముకునే సమయంలో భారీ వర్షం కురవడం వల్ల ధాన్యం మొత్తం నీటిపాలు అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం ఆరబెట్టడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోయారు. టార్పాలిన్ కవర్లు కప్పినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈదురుగాలులతో టార్పాలిన్ కవర్ లేచిపోయి ధాన్యం మొత్తం తడిచిపోయిందని రైతులు లబోదిబోమంటున్నారు. ఈదురు గాలులతో మండల వ్యాప్తంగా వరి చేను నేలకొరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story