కొమురవెల్లి ఘటన పై స్పందించిన హరియాణా గవర్నర్

by Kavitha |
కొమురవెల్లి ఘటన పై స్పందించిన హరియాణా గవర్నర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన పై హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పందించారు. పోలీస్ కమిషనర్ అనురాధ తో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత బాలికకు పునరావాస ఏర్పాట్లు చేయాల్సిందిగా అలాగే బాలికను కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి నిందితుడు షరీఫుద్దీన్ ని కఠినంగా శిక్షించాలని గవర్నర్ దత్తాత్రేయ కోరాడు. పోలీసు కమిషనర్ అనురాధ సానుకూలంగా స్పందించి బాలిక ఉన్నత చదువుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అలాగే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ కు హామీ ఇవ్వడం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed