సద్ది తిన్నా రేవు తలవాలే : మంత్రి హరీష్ రావు

by Dishanational1 |
సద్ది తిన్నా రేవు తలవాలే : మంత్రి హరీష్ రావు
X

దిశ, వర్గల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరువు ఉండేది సీఎం కేసీఆర్ వచ్చాక దశ తిరిగింది ఇప్పుడు.. కొండపోచమ్మతో నీరు పుష్కలంగా నీళ్లు ఉండడంతో భూమికి బరువయ్యే పంట పండుతున్నది..ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.. సద్ది తిన్నా రేవు తలవాలే.. కాంగ్రెస్, బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో రూ. 200, రూ. 500కు మించి పెన్షన్ ఇవ్వట్లేదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో అమలైతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఇతర పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నరని, ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉచితాలు వద్దు అంటుంది, బాయిల కాడ మీటర్లు పెట్టాలంట్టుంది అని, కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంతవరకు రైతులకు బయిల కాడ మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని తెల్చి చెప్పిండు అని, ప్రజలను పక్కదోవ పట్టించే నాయకులు ఎంత మంది వచ్చినా రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మన ప్రభుత్వానిదే అని వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం వర్గల్ మండలంలో తునికి ఖల్సా గ్రామంలో నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని అనంతర ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వాలలో ఏనాడు కూడా పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. మండలంలో మొత్తము నూతనంగా 887 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని మంత్రి అన్నారు.

వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు తోబుట్టువుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతును దేశానికి సేవ చేసే సైనికుడు మాదిరిగా గుర్తించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణం ఉన్నంతవరకు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తారని అన్నారు. అనంతరం తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని హిందు-ముస్లింలు ప్రతీ కులం, మతం వాళ్లు సంతోషంగా ఉన్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, గడ ముత్యం రెడ్డి, సర్పంచ్ కటికె సంధ్య జాని, జడ్పీటీసీ బాలమల్లు, ఎంపీపీ లత రమేష్, ప్యాక్స్ చైర్మన్ ఇర్రి రామకృష్ణ, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీఓ స్వర్ణ కుమారి, ఎమ్మారో సతీష్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేలూరి వెంకట్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed