ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.. కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే వినతి

by Kodari Anjali |

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతిపత్రం చేశారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.. కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే వినతి
X

దిశ, మెదక్ ప్రతినిధి: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతిపత్రం చేశారు. జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తి కావడం లేదని వెంటనే స్పందించి పూర్తి చేయాలని తెలిపారు. చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం లేదని తెలిపారు. రానున్న వర్షాకాలంలో సకాలంలో విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.

నకిలీ విత్తనాల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

సబ్స్టేషన్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి సకాలంలో నిరవధికంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ విత్తనాల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంజి రెడ్డి, మెదక్ మండల్ ఎక్స్ ఎంపీపీ కిష్టయ్య , రాజ్ పల్లి సర్పంచ్ దోతి నారాయణ, సాంబశివరావు, మాజీ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు భట్టి ఉదయ్ లు ఉన్నారు.

Next Story