అనాథలను ప్రభుత్వం ఆదుకోవాలి : మందకృష్ణ మాదిగ

by Disha Web Desk 15 |
అనాథలను ప్రభుత్వం ఆదుకోవాలి : మందకృష్ణ మాదిగ
X

దిశ, ప్రజ్ఞాపూర్ : అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా మారి ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించి ఏడు సంవత్సరాలు దాటిందని, వారి సంక్షేమానికి ఎలాంటి నిధుల కేటాయించపోవడం దురదృష్టకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజ్వేల్ లో ఇద్దరు అనాథ పిల్లలు తమ గోడు చెప్తుంటే కంటనీరు వచ్చిందని తెలిపారు. మంత్రి మండలి తీర్మానం చేసినా ఆచరణలో పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు లేకపోవడం, ఓటు హక్కు లేకపోవడం వల్లే ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2015 జనాభా లెక్కల ప్రకారం 6 లక్షల మంది అనాథలు ఉన్నట్లు ప్రభుత్వ తేల్చగా ప్రస్తుతం 10 వేల కు చేరారని అన్నారు. ఈ బడ్జెట్ లో వారికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తానన్న స్మార్ట్ కార్డులు వెంటనే ఇవ్వాలని, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని , రిజర్వేషన్లు కల్పించాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. మానవ అక్రమ రవాణాదారులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని, యాచక వృత్తిలో ఉన్న అనాథ పిల్లలపై స్పెషల్ డ్రైవ్ చేసి ప్రభుత్వ హోంకి తరలించాలని పేర్కొన్నారు.

స్పందించకపోతే ఉద్యమం

ప్రభుత్వం అనాథ పిల్లల కోసం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుందని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఈ నెల 15న గజ్వేల్ లో అనాథ పిల్లలతో దీక్ష చేపట్టి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. రెండో విడత సిరిసిల్లలో, మూడో విడత మంత్రుల నియోజకవర్గాల్లో, చివర విడత అన్ని జిల్లా కేంద్రాల్లో అనాథల కోసం నిరసన దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. సమావేశంలో ఎంఈఎఫ్ జిల్లా కన్వీనర్ కృష్ణ, నాయకులు మల్లి గారి యాదగిరి, లింగంపల్లి శ్రీనివాస్, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed