సాగునీటితో బీడు భూముల్లో బంగారు పంటలు : మంత్రి హరీష్ రావు

by Sridhar Babu |
సాగునీటితో  బీడు భూముల్లో బంగారు పంటలు : మంత్రి హరీష్ రావు
X

దిశ, నారాయణఖేడ్ : సాగునీటితో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బీడు భూములు బంగారు పంటలు పండుతాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా మనూరు మండలం కాలేశ్వరం శివుడి వద్ద నుండి బోరంచ నల్ల పోచమ్మ తల్లి పాదాల వద్దకు నీటిని తీసుకువచ్చేందుకు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి భూమి పూజ చేశారు. బోరంచ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 116 మంది జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణానికి, జగన్నాథ్ పూర్లో చెరువు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కరూసుగుత్తి గ్రామంలో రూ.6.68 కోట్లతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని, మొర్గిలో రూ. 1.28 కోట్లతో నిర్మించిన ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలేశ్వరం శివుడి వద్ద నుండి బోరంచ నల్ల పోచమ్మ తల్లి పాదాల వరకు నీటిని తీసుకొచ్చేందుకు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణ ఖేడ్, అందొల్ నియోజకవర్గ పరిధిలోని 1.65 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు రూ. 1774 కోట్లతో 8 టీఎంసీల నీటిని అందిస్తామని, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1.31 లక్షలు, అందోలు 36 లక్షలతో ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్తు పరికరాల కోసం కేటాయించినట్టు చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం నుంచి సాగునీటిని ఆరో లింకు ద్వారా సింగూర్ జలాశయానికి తరలిస్తామన్నారు. ఈ జలాశయం నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకుని ఆయకట్టకు తరలించేలా నీటిపారుదల శాఖ ఈ పథకాన్ని డిజైన్​ చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలతో నారాయణ ఖేడ్ ప్రాంత భూములకు ధరలు పెరిగాయని తెలిపారు.

గతంలో కేవలం రూ. 60 వేలు ఎకరం ఉన్న భూముల ధర నేడు రూ. 60 లక్షలకు పెరిగింది అన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, అందోల్ క్రాంతి కిరణ్, కలెక్టర్ శరత్ కుమార్, కలెక్టర్ వీరారెడ్డి, ఎస్పీ రమణ కుమార్, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ, ఎంపీపీలు కొంగ జయశ్రీ, మోతి బాయ్ రాథోడ్, జర్ర మైపాల్ రెడ్డి, జెడ్పటీసీ లక్ష్మి బాయి, రాజు రాథోడ్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ రాథోడ్ రాజు నాయక్, నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు విట్టల్ రావు, పరమేశ్వర్, పండరి, మున్సిపల్ చైర్ పర్సన్ రూబీనా బేగం నజీబ్, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జగదీశ్వర్ చారి, బోరంచ సర్పంచ్ రేణుక, జర్నలిస్టుల అధ్యక్షులు అమృత్, రవి, గౌరవ అధ్యక్షులు శ్రీకాంత్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed