ఉద్యోగాలు ఇవ్వండి పెన్షన్ కాదు : ఎమ్మెల్యే

by Disha Web Desk 22 |
ఉద్యోగాలు ఇవ్వండి పెన్షన్ కాదు : ఎమ్మెల్యే
X

దిశ, దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని నర్సంపల్లి, మచిన్ పల్లి, అప్పయ్య పల్లి , గ్రామాలలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇట్టింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆత్మ గౌరవంతో బతికితే కేసీఆర్‌కు నచ్చదని, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా 10 ఏళ్ల నుంచి మోసం చేసారని అన్నారు. ఇంట్లో బిడ్డలకు కొలువులు వస్తే పెన్షన్ లకు ఆశపడే అవసరం ఎందుకు ఉంటుందో తల్లిదండ్రులు ఆలోచన చేయాలనీ కోరారు. పేద ప్రజల కోసం అని చెప్తున్నా సంక్షేమ పథకాలు కారు పార్టీ కార్యకర్తలకే వస్తున్నాయని అలాంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పేరుకు ఉచిత విద్యుత్ కానీ నెల నెల బిల్లులు మాత్రం తడిసి మొపెడు అవుతుందని అన్నారు.

తెలంగాణ వచ్చిన తరువాత గ్రామాలలో రాత్రి పూట రోగమొస్తే మందుబిల్లా దొరకడం లేదు కానీ బెల్ట్ షాపులలో మద్యం 24 గంటలు దొరుకుతుందని పేర్కొన్నారు. మచిన్ పల్లి నుంచి చేగుంట తూప్రాన్ హైవే వరకు రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధం అయ్యిందని, ఎన్నికల తరువాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పదేళ్లు పల్లెల మొఖం చూడని ప్రభాకర్ రెడ్డి ఓట్ల కోసం పల్లెల చుట్టు ప్రదక్షణాలు చేస్తున్నాడని అన్నారు. కుల సంఘం భవనలు కట్టిస్తామని మభ్యపెట్టాలని చూస్తున్నారని, మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. గ్రామాలలో ఉన్న సమస్యల గురించి అవగాహనా లేని నాయకుడు గెలిచి ఏం ఒరగబేడతాడని అన్నారు. గ్రామాలలో యువతను మద్యానికి బానిసలుగా చేసి ఓట్లు పొందే వ్యూహంతో అధికార బీఆర్‌ఎస్ పార్టీ, యువతను మద్యానికి బానిసని చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు , కార్యకర్తలు , పాల్గొన్నారు.

Next Story