- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
బీసీ మహిళకు అన్యాయం జరిగితే సహించం: గంగారం

దిశ, మెదక్ టౌన్: జగిత్యాల మున్సిపల్ చైర్మన్ కు అన్యాయం జరిగితే సహించేది లేదని మెదక్ జిల్లా బీసీ సంఘం అద్యక్షుడు గంగారాం అన్నారు. మెదక్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారాం మాట్లాడుతూ బీసీ ఆడబిడ్డ అయినటువంటి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి పదవి నుండి తప్పించేందుకు ఒత్తిడి తీసుకొచ్చిన ఎమ్మెల్యే సంజీవ రావును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ బీసీ కావడంతో ఓర్వలేని ఎమ్మెల్యే డ్రామాలు ఆడి రాజీనామా చేసేలా ఒత్తిడి తేవడం హేయమైన చర్య అని బహుజన ప్రజలు కన్నెర్రా చేస్తే తట్టుకుంటారా అని ప్రశ్నించారు.
మెజారిటీ శాతం ఉన్న మా బీసీ బహుజనులు మీకు రాజకీయ జీవితాలను ప్రసాదిస్తుంటే అక్కడక్కడా మా బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు అయితే కూడా మీరు సహించలేకపోతున్నారని.. జాగ్రత్త ఓసీల్లారా మా ఓట్లు లేనిదే మీ జీవితాలు లేవని గుర్తించండి లేదంటే తిరుగుబాటు తప్పదని ఘాటుగా విమర్శించారు. బీసీల పైన జరుగుతున్న అన్యాయాలను గమనిస్తూన్నారని.. భవిష్యత్ లో బుద్ధి చెప్పే రోజులు ముందు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకాల జయరాములు, బీసీ డివిజన్ అధ్యక్షుడు బొద్దుల కృష్ణ, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గుండు ప్రశాంత్ కుమార్, బిట్ల నర్సింహులు, శ్రీపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం, కార్యదర్శి అల్లం మధు తదితరులు పాల్గొన్నారు.