- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్‌లోకి

దిశ, చేగుంట: భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళ నాయకురాలు ఒకే రోజు పార్టీని వీడి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని చందాయిపేట గ్రామానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మండల కార్యదర్శి 9వ వార్డు సభ్యురాలు సూరం రమ్య రవి సోమవారం రోజు మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ పార్టీ నాయకుల వైఖరి నచ్చక బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మండల మహిళా నాయకురాలు, చందాయిపేట సీనియర్ నాయకురాలు అచ్చంపేట పద్మ స్వామి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. వీరితోపాటు మరో 20 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఒకే రోజు ఇద్దరు మహిళా నాయకురాలు బీజేపీ పార్టీ వీడి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమయ్యింది. గత కొన్ని రోజులుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ పార్టీలో చేరుతుండగా, బీజేపీకి చెందిన మహిళ నాయకురాలు ఇతర పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంపూర్ సర్పంచ్ కాశ బోయిన భాస్కర్, సీనియర్ నాయకుడు పంబల నాగరాజు, ముజామిల్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, సీనియర్ నాయకుడు రాజిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.