పరమాన్నం పెడతామని హామీ ఇచ్చి పంగ నామాలు పెడుతున్నారు : హరీష్ రావు

by Aamani |
పరమాన్నం పెడతామని హామీ ఇచ్చి పంగ నామాలు పెడుతున్నారు : హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎలక్షన్ ముందు కోతలు.. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగవేతలు.. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన లో సైతం అదే పరంపర కొనసాగిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధి గాడిచర్ల పల్లి లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీఎం రేవంత్ రెడ్డి కి రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. నవంబర్ 30న 41 వేల కోట్ల రుణ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు గుర్తు చేశారు. కానీ రూ.16 వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామం కొండారెడ్డి పల్లిలో అయినా సరే.. గాడిచర్ల పల్లి లో అయినా సరే రుణ మాఫీ కచార్ వద్ద చర్చకు సిద్దమని హరీష్ రావు సవాల్ విసిరారు.

రుణమాఫీ అయిపోయిందని హైదరాబాద్ లో కూర్చోని మాట్లాడడం కాదని... సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు దమ్ముంటే.. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే గ్రామ సభలకు వచ్చి రైతులకు సమాధానం చెప్పాలన్నారు. దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం, ప్రజల డబ్బులు వృధా చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మంది రైతులకు రుణ మాఫీ చేశారు.. రుణ మాఫీ కానీ రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ. 2500 సాయం, అవ్వ తాతలకు రూ.4 వేల పెన్షన్, కళ్యాణ లక్ష్మి పథకం లో తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల ఇన్ కమ్ లిమిట్ పెంచి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు కట్టించలేదు కానీ.. హైడ్రా పేరిట డ్రామాల డి పేదలకు ఇండ్లు ను కూల్చాడని మండిపడ్డారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లో ప్రభుత్వం ఉపాధి హామీ జాబ్ కార్డు, పని దినాలు ఇలా సాకులు చెప్పి కోతలు విధిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట గ్రామ, వార్డు సభల్లో ఆ ఎమ్మెల్యేలా ఫోటోలు పెట్టకుండా ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మహిళలకు రూ.2500 ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేశాడని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వృద్ధులకు పెన్షన్ రూ.4వేలు పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేశారని అన్నారు. ఇన్ చార్జి మినిస్టర్ పేరిట కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాల్లో ప్రధాన్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజా తిరుగుబాటు తప్పదని హరీష్ రావు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed