యూజీడీ ఓవర్ ఫ్లో సమస్యను పరిష్కరించండి

by Disha Web Desk 22 |
యూజీడీ ఓవర్ ఫ్లో సమస్యను పరిష్కరించండి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం వాడీ వేడిగా జరిగింది. మున్సిపాల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మున్సిపాల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూజీడీ ఓవర్ ఫ్లో సమస్యను పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు. వెంటనే స్పందించిన మున్సిపాల్ చైర్ పర్సన్ సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపాల్ ఏఈని ఆదేశించారు. అదే విధంగా దసరా, బతుకమ్మ పండుగల ఏర్పాట్ల పై సమావేశంలో చర్చించారు. చెరువల్లో గుర్రపు డెక్క తొలగించడంతో పాటుగా, బతుకమ్మ పండుగ రోజు మహిళలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపాల్ ఏఈ, శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ లను ఆదేశించారు. దసరా పండుగ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎజెండాలోని 30 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. సర్వసభ్య సమావేశంలో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపాల్ కమిషనర్ సంపత్ కుమార్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story