ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అగ్ని ప్రమాదం

by Sridhar Babu |
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అగ్ని ప్రమాదం
X

దిశ, కొల్చారం : ఆదివారం సాయంత్రం వేచిన ఈదురుగాలులకు అగ్ని కణాలు వచ్చి పడడంతో ధాన్యం రాశి, తూకం వేసిన ధాన్యం బస్తాలు కాలిపోయిన సంఘటన కొల్చారం మండలం పైతర శివారులో జరిగింది. రోహిణి కార్తె రావడంతో పంట పొలాలను వర్షాకాలం పంటల సాగు కోసం రైతులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు యాసంగి పండిన ధాన్యం మిల్లులకు తరలించకపోవడంతో ఎక్కడిధాన్యం అక్కడే ఉంది. పైతర గ్రామంలో రంగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రానికి సరైన సమయంలో

లారీలు రాకపోవడంతో చాలామంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉంది. కాగా ఆదివారం సాయంత్రం కొనుగోలు కేంద్రం సమీపంలో పంట పొలాల్లో నిప్పు పెట్టడంతో అగ్ని కణాలు వచ్చి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం బస్తాలపై పడటంతో ధాన్యం రాశులు, బస్తాలు కాలిపోయాయి. గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్యకు చెందిన సుమారు 100 సంచుల ధాన్యం రాశికి, వెలుమ కన్య భూమయ్యకు చెందిన తూకం వేసిన 150 బస్తాల ధాన్యం సంచులకు నిప్పు అంటుకుంది. వెంటనే రైతులందరూ కలిసి మంటలను ఆర్పి వేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ధాన్యం తరలింపు పై దృష్టి సారించాలని గ్రామానికి చెందిన రైతులు కోరుతున్నారు.

Next Story