- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుల్లెట్ ట్రైన్ కోసం పోరాటం.. ఎంపీ, మాజీ ఎంపీలకు వినతులు
హైదరాబాదు-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును జహీరాబాద్ మీదుగా మళ్లించాలని కోరుతూ జహీరాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ నామ స్రవంతి రవికిరణ్ నేతృత్వంలోని బృందం నిన్న ఎంపీ- మాజీ ఎంపీకి వినతి పత్రాలను అందజేశారు.

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా, ప్రతిష్టాత్మకమైన హైదరాబాదు-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును జహీరాబాద్ మీదుగా మళ్లించాలని కోరుతూ జహీరాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ నామ స్రవంతి రవికిరణ్ నేతృత్వంలోని బృందం నిన్న ఎంపీ.సురేష్ శెట్కార్, నేడు మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ను కలిసి వినతి పత్రాలను అందజేశారు. జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, నిమ్జ్ వంటి భారీ ప్రాజెక్టులు ఇక్కడ వస్తున్న నేపథ్యంలో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం అత్యంత అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో బీబీ పాటిల్ ఎంపీగా ఉన్న సమయంలోనే ఆయన చొరవతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో జహీరాబాద్‌ను ఒక స్టేషన్‌గా చేర్చడం జరిగిందని, ఇది జహీరాబాద్ ప్రాంతం అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని గుర్తు చేశారు. అయితే, తాజా డీపీఆర్ లో మార్పులు చేసి, ఆ మార్గాన్ని వికారాబాద్ మీదుగా మళ్లించడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తిని, నిరాశను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీ నేతలతో కలిసి గత సోమవారం జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ శెట్కార్‌కు కూడా వినతిపత్రం సమర్పించారు.
సానుకూల స్పందన...
ప్రజల విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన మాజీ ఎంపీ.బీబీ పాటిల్ దీనిపై తక్షణమే స్పందిస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర రైల్వే మంత్రిని, సంబంధిత ఉన్నతాధికారులను స్వయంగా కలిసి, డీపీఆర్‌లో తగిన మార్పులు చేసి బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని తిరిగి జహీరాబాద్ మీదుగా వెళ్లేలా, అక్కడ ఒక ఆధునిక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్, కోహిర్ మండల యువ నాయకుడు రాచయ్య యాదవ్, నరేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.






