- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధాన్యం కొనుగోలు కోసం రైతుల ఎదురుచూపులు

దిశ,శివ్వంపేట : శివ్వంపేట మండలంలో 37 గ్రామాల రైతులు భూగర్భ జల బోర్ల పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి కంటిమీద కునుకు లేకుండా పొసే కొద్దిపాటి నీరును మడిమడికి మళ్లించి, ఆరుగాలం ఎండలో కష్టపడి పంట ఎండిపోకుండా కాపాడుకొని, పంట పండిస్తే, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నప్పటికీ అది సరైన సమయంలో క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. సరైన సమయంలో పంట చేతికి వచ్చాక ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కూడా ఐకెపీ గానీ, సొసైటీ గాని ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం తో రైతులు పండించిన ధాన్యాన్ని, ప్రైవేట్ దళారులకు అమ్ముకుంటున్నారు.
శివంపేట మండల వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. వరి కోతలు అయిపోవడానికి వస్తున్న తరుణంలో ధాన్యం ఆరబెట్టిన రైతులు, కల్లాల వద్ద ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ వారి ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కొనుగోలు కేంద్రాలలో వారి యొక్క ధాన్యాన్ని విక్రయించడానికి వేలాది మంది రైతులు సిద్ధంగా ఉన్నారు. గ్రామాలలో రైతులందరూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి వడ్లను తీసుకోవాలని కోరుతున్నారు.అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఎవరైన రైతులు అధికారులకు ఫోన్ చేసి అడిగిన, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం పైనుంచి తమకు ఆదేశాలు రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎన్ని రోజులు అంటే ధాన్యపు రాశులు పోసుకొని, కొనుగోళ్ల కోసం ఎదురు చూడాలని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, కిందిస్థాయి అధికారులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.