తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

by Disha Web Desk 22 |
తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
X

దిశ, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో భూమిని గత 50 ఏళ్ల నుండి సాగు చేసుకుని బ్రతుకుతున్నామని, రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు జైన్ సర్వే నిర్వహించి తమకు పట్టా పాసు బుక్కులు అందించాలని గురువారం రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందించారు. జిల్లా కలెక్టర్ రాజిర్షి షా స్పందించి త్వరగా పట్టాలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శివకుమార్, వార్డు సభ్యులు నాయన ప్రవీణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story