- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అధికారులతో కుమ్మక్కై నీటి దోపిడీ....

దిశ, తూప్రాన్ : అధికారులతో కుమ్మక్కయిన ఓ బడా నాయకుడు రాత్రికి రాత్రే గద్దర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి బీటీ రోడ్డు ధ్వంసం చేసి నీటి దోపిడీకి పాల్పడుతున్నాడు.వివరాల ప్రకారం తూప్రాన్ మండలం యావపూర్ కిష్టపూర్ అనుకుని ఉన్న 80 ఎకరాల మామిడి తోట కు చెందిన ఓ వ్యక్తి అర్ధరాత్రి రోడ్డు ధ్వంసం చేసి భారీగా పైప్ లైన్ వేసి నీటిని అక్కడికి తరలిస్తున్నారు అని చుట్టూ ప్రక్కల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పంట పొలాల కోసం కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హాల్దీవాగు లోకి నీటిని విడుదల చేశారు.దీంతో గురువారం రాత్రికి రాత్రే పైప్ లైన్ వేసి నీటిని తరలిస్తున్నారు.
బీఆర్ఎస్ కి చెందిన ఓ బడా నాయకుని పేరు చెప్పుకుంటూ అటు అధికారులను ఇటు రైతులను బెదిరింపులకు గురిచేస్తూ తన ఇష్టానుసారంగా రైతుల పంట పొలాలకు వెళ్లే నీటిని అర్ధరాత్రి దోపిడీ చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.