ప్రమాదం అంచున విద్యుత్ వైర్లు...

by Kodari Anjali |

విద్యుత్ వైర్లు తెగిపడిన రైతులకు ఇబ్బంది కలుగుతున్న సంఘటన, మండల కేంద్రంలోని శ్రీ శేరుపల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో జరిగింది.

ప్రమాదం అంచున విద్యుత్ వైర్లు...
X

దిశ, చిన్నకోడూరు: విద్యుత్ వైర్లు తెగిపడిన రైతులకు ఇబ్బంది కలుగుతున్న సంఘటన, మండల కేంద్రంలోని శ్రీ శేరుపల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో చోటుచేసుకుంది. రైతు బైండ్ల నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తన వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు తెగి నేలపై పడివున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా ఈ పరిస్థితి నెలకొన్న విద్యుత్ శాఖ సిబ్బంది తెగిపడితే మాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని రైతుల కోరుతున్నాను.

Next Story