- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిర్లక్ష్యానికి నిలయాలు డంపింగ్ యార్డులు

దిశ,దౌల్తాబాద్: గ్రామాలను స్వచ్ఛతకు నిలయంగా మార్చాలని సంకల్పంతో, గ్రామాల్లో సేకరించిన చెత్తతో డంపింగ్ యార్డ్ లో సేంద్రియ ఎరువుల తయారీ వంటి ఉన్నత లక్ష్యంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టిన డంపింగ్ యార్డులు నేడు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. అవి ఉపయోగంలో లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు తమ అవసరాలకు వాడుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పశువుల పాకలుగా, మరికొన్ని గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. వీటి నిర్వహణ చూడాల్సిన పంచాయతీ కార్యదర్శులు అటు దిక్కు తొంగి చూడక పోవడం గమనార్హం.
గ్రామాల్లో సేకరించిన చెత్తను పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఇష్టారీతిన బహిరంగ ప్రదేశాలలో వేసి కాల్చి వేస్తున్న దాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన ఉపయోగంలో లేక అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మండల వ్యాప్తంగా 24 గ్రామపంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. ప్రారంభంలోనే గ్రామాల్లో తడి పొడి చెత్తగా పారిశుద్ధ్య సిబ్బంది స్వీకరించి సేంద్రియ ఎరువులుగా మార్చగా కొంత ఆదాయం లభించేది. రాను రాను పర్యవేక్షణ లోపించడం, పట్టించుకునే వారు లేకపోవడంతో గ్రామాల్లో సేకరించిన చెత్తను గ్రామాలకు అవతల బహిరంగ ప్రదేశాల్లో వేసి కాల్చి వేయడం జరుగుతుంది. మండల స్థాయి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం, పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోకపోవడం, గ్రామాలలో సర్పంచుల పదవి కాలం ముగిసిపోవడంతో వీటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. లక్షలాది రూపాయల ప్రచార హెచ్చించి సదుద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం మూలంగా నీరుగారుతుండడం పట్ల పలు గ్రామాల ప్రజలకు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సూరంపల్లి గ్రామపంచాయతీలో సేకరించిన చెత్త సమీపంలో చెరువులో పడవేస్తుండగా, తిరుమలాపూర్ గ్రామంలో సేకరించిన చెత్తను గ్రామ సమీపంలోని ఓ బావిలో వేసి నిప్పు పెడుతున్నారు. ఇది ఒక ఊరు రెండు ఊర్ల కథ కాదు. ప్రతి ఊరిలో ఇదే తంతు జరుగుతోంది. సంవత్సర కాలం నుండి ఇదే జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వేయం చేసి నిర్మాణాలు చేపట్టినప్పటికీ వాటిని వినియోగించడంలో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం నిర్ణయించుకున్న లక్ష్యం నీరుగారిపోతోంది. కోట్లాది రూపాయల ధనం వృధా కావడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. ఇప్పటికైనా మండల జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేసి వాటిని వినియోగంలోకి తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.