దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Disha Web Desk 12 |
దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ యేనగంటి కనకరాజు ఆధ్వర్యంలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఈ గ్రామం నుండి మంచి మెజారిటీ ఇచ్చి నా గెలుపులో కీలక పాత్ర పోషించిన మలుపల్లి గ్రామాన్ని ఎన్నడు మర్చిపోలేనని, గ్రామ కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటానని.. గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మాణం అవుతున్నాయి అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే కారణమని అన్నారు. కానీ దానికి కొందరు నాయకులు నిధులను మేమంటే మేము తెచ్చామని చెప్పుకుంటున్నారని, అలాగే కరోనా ఆపద సమయంలో పేద గ్రామీణ పేద ప్రజల కోసం గడచిన రెండు సంవత్సరాలుగా ఉచితంగా ఐదు కిలోల రేషన్ బియ్యం పంచుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నారు.

ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారని ఈ సందర్భంగా మీరందరూ తెలుసుకోవాలని అన్నారు. రోడ్ల విషయంలో మేమంటే మేము చేపించాము రోడ్ల అభివృద్ధి అని ప్రస్తుతం చెప్తున్న సర్పంచులు నాయకులు వారి హయాంలో మరి రోడ్లు ఎందుకు కాలేదు. మిరుదొడ్డి, అల్వాల, మల్పల్లి గ్రామాల రోడ్లు దాదాపు 8 సంవత్సరాలు కూడా వారి హయాంలోనే కదా నడిచింది. అంతా ఈ రోజు ఊరులోకి వచ్చి మేమంటే మేము చేసాము అని జబ్బలు చర్చుకొని, చాతి కొట్టుకుంటున్న అందరూ ఇవన్నీ ఇంతకుముందు ఎందుకు కాలేదు అనేది ప్రజలకు చెప్పాలి.. అడగనిదే అమ్మ అయినా బువ్వ పెట్టదు అన్నట్లు ఇన్ని సంవత్సరాలు ఈ పనులు ఎందుకు కాలేదని వాళ్లను అడగాలని అన్నారు.

మలుపల్లి గ్రామంలో ఒక సమస్య ఉందని డబుల్ బెడ్ రూమ్‌లో ఇండ్లలో ఇండ్లు ఉన్న వారికే వచ్చాయని, దీనిపైన కలెక్టర్ ఎంక్వయిరీ కూడా జరిగిందని ఈ విషయంలో గ్రామ ప్రజలు ఒకటి గుర్తుంచుకోవాలని, 5 ఎకరాల భూమి, ఇండ్లు ఉన్నవారు అర్హులు కారని, అర్హులైన వారికి రాలేదని అక్క చెల్లెలు ఆడపడుచులు రెండు మూడు సార్లు నన్ను కలవడం జరిగిందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనేవి తప్పకుండా నిలువ నీడలేని గరీబోళ్లకు మాత్రమే వస్తాయని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

మొన్న అసెంబ్లీలో అడుగగా సొంత జాగా ఉన్నోళ్లకు 5 లక్షలు ఇస్తా అన్న ప్రభుత్వం మూడు లక్షలు ఇస్తా అని ఒప్పుకుంది. కానీ అది జీవో వచ్చి కార్యరూపం దాల్చడానికి ఉగాది పండుగ దాటిపోవచ్చని ఆలోపు ఎలక్షన్ కోడ్ వస్తే అప్పటికి ఇల్లు కట్టేది ఉండదు ఆ మూడు లక్షలు వచ్చేది ఉండదన్నారు. అప్పుడు వచ్చి మళ్ళీ మాకే ఓటు వేయండి అని వస్తారు నమ్మొద్దు ఇక అన్నారు.

నిజంగా ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు ఆలోచించుకోవాలని నాకు తక్కువ సమయం ఇచ్చిన మలుపల్లి గ్రామ పెద్దలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మీకు ఎలాంటి అవసరం, ఆపద వచ్చిన దుబ్బాకలో మారెమ్మ గుడి దగ్గరలో ఇల్లు కట్టుకున్న అక్కడికి వచ్చి మాట్లాడవచ్చని గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎలుముల దేవరాజ్, మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story