వేద పాండిత్యంలో చీకోడు వాసికి డాక్టరేట్

by Shiva Kumar |
వేద పాండిత్యంలో చీకోడు వాసికి డాక్టరేట్
X

దిశ, దుబ్బాక : వేద పాండిత్యంలో విశేష కృషి చేస్తున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామానికి చెందిన కొండపాక కృష్ణమాచార్యులుకు డాక్టరేట్ లభించింది. సినిమా రంగంలో గేయ రచనలు, కథలను సమకూరుస్తూనే వేద పాండిత్యం, రాజకీయ జ్యోతిష్యం, వాస్తు రంగంలో రాష్ట్రంలోనే మంచి గుర్తింపు పొందిన కృష్ణమాచార్యులకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆదివారం తమిళనాడులోని హోసూర్ క్లరిస్టా హోటల్లో డాక్టరేట్ ను ప్రధానం చేశారు.

వేద ధార్మిక సేవ సమితికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూనే పలు సామాజిక సేవ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వేద పాండిత్యంలో డాక్టరేట్ సాధించిన కృష్ణమాచార్యులకు బ్రహ్మణ సంఘాల వేద పండితులు నరహరి, తిరుమలచార్యులు, లక్ష్మణాచార్యులు, సీహెచ్ కృష్ణమాచార్యులు, శ్రీధర్ అభినందనలు తెలిపారు. వేద పాండిత్యంలో డాక్టరేట్ సాధించిన కృష్ణమాచార్యులు సిద్దిపేట జిల్లాకు ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతలను సంపాదించడం గర్వ కారణమని అన్నారు.

Next Story