- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పీఏసీఎస్ చైర్మన్,వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
దిశ, చేర్యాల: చేర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ వంగ చంద్రారెడ్డి (బిఆర్ఎస్ ),వైస్ చైర్మన్ తాల్లపల్లి నర్సయ్య ల వ్యవహార శైలి నచ్చక పోవడంతో పైన సహకార సంఘం సభ్యులు పెట్టిన అవిశ్వాసం సోమవారం నెగ్గింది. చైర్మన్, వైస్ చైర్మన్ ల పైన గత సంవత్సరమే ఏడుగురు కార్యవర్గ సభ్యులు అవిశ్వాసం తీర్మానం పెట్టగా, రాష్ట్ర సహకార సంఘం ట్రిబ్యునల్ అవిశ్వాసం పై స్టే విధించింది.
ట్రిబ్యునల్ విధించిన స్టే గత నెల 7వ తేదీన ఎత్తివేయడంతో, సహకార ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాల మేరకు జిల్లా సహకార శాఖ అధికారి (డిసిఓ) కరుణ, అసిస్టెంట్ డిసిఓ రఘోత్తంరెడ్డి సోమవారం అవిశ్వాసం పై సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడంతో చైర్మన్ చంద్రారెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. 11 మంది కార్యవర్గ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ లకు వ్యతిరేకంగా అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు లేపడంతో చైర్మన్ వంగ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ తాళ్ళపల్లి నర్సయ్యలను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా అధికారి కరుణ తెలిపారు. కాగా నూతన చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 14వ తేదీ వరకు గడువు పెట్టగా తాత్కాలిక చైర్మన్ గా మేరుగు కృష్ణ( కాంగ్రెస్ పార్టీ)ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.