సీఎంఆర్ ధాన్యం నిల్వల్లో తేడా.. మిల్లర్ పై కేసు

by Shiva Kumar |
సీఎంఆర్ ధాన్యం నిల్వల్లో తేడా.. మిల్లర్ పై కేసు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సీఎంఆర్ కింద కేటాయించిన వరి ధాన్యపు నిల్వల్లో వ్యత్యాసం ఉండటంతో హుస్నాబాద్ మండలం ఆరేపల్లిలో ఉన్న ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాని ఆనంద్ దాస్ రామ్మోహన్ పై క్రిమినల్ కేసు పెట్టినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి సీహెచ్ బ్రహ్మారావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి మాట్లాడుతూ.. ఇటీవల జరిపిన తనిఖీలల్లో సీఎంఆర్ ధాన్యం నిల్వలల్లో తేడాను గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు మిల్లర్ పై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించామని, అతని ఆస్తులన్నిటినీ ప్రభుత్వ పరం చేసేందకు గాను పౌర సరఫరాల కమిషనర్ అదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 2022-23 వరి ధాన్యం సేకరణ కోసం జిల్లాలో 416 కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అదేశించినట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed