- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
కాంగ్రెస్ పార్టీవి దొంగ డిక్లరేషన్లు: మంత్రి హరీష్ రావు

దిశ, పటాన్ చెరు: కాంగ్రెస్ పార్టీ దొంగ డిక్లరేషన్లు గ్యారంటీలతో ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్ రూంలను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జీఎచ్ఎంసీ పరిధిలోని 9 నియోజకవర్గాలు కుత్బుల్లాపూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలో గురువారం ఇండ్ల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో లక్ష ఇండ్లు ఇస్తున్నామని, కొల్లూరు 150 ఎకరాల్లో 16700 ఇండ్లతో ఆసియాలోనే అతి పెద్ద టౌన్ షిప్ నునిర్మించామన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు 2 లో 4800 మంది లబ్దిదారులకు రెండో విడత లో ఇండ్లను పంపిణి చేస్తున్నామని ఒక్కొక నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున కేటాయించినట్లు తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఎవరికి ఏ బ్లాక్ లో ఇల్లు వచ్చిందనేది కంప్యూటర్ ద్వారా కేటాయింపు చేస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్న కాలనీలలో ప్రభుత్వ పాఠశాల రేషన్ షాప్ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జనాలకు కిట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ తిట్లు ఇస్తున్న ఎక్కడ వెనకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారన్నారు.
60 ఏళ్లలో టీడీపీ, కాంగ్రెస్ చేయని పనులను 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో పూర్తి చేశామన్నారు. రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి... అమెరికాలో ఉన్నానా అన్నారని, రజినికి అర్థమైన అభివృద్ధి, ఇక్కడున్న కాంగ్రెస్, బీజేపీ గజినీలకు అర్థమైతలేదని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టులో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేస్ కొట్టుకుపోయిందని, ఆలస్యం అయిన న్యాయం, ధర్మమే గెలుస్తుందనాడనికి ఇదే నిదర్శమన్నారు. 90 టీఎంసీ ల నీళ్ళు కృష్ణా నదీ జలాల్లో మనకు వాటా దక్కుతుందని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి తెచ్చుకొని కృష్ణా నది జలాలను బాజప్తా ఎత్తిపోసుకొని పాలమూరు రిజర్వాయర్లు నింపుకుందామన్నారు.
ప్రజలే బీఆర్ఎస్ పార్టీ కి హైకమాండ్ అని ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ అయి, ఏం అభివృద్ధి చేసాడో మీరే మీ గల్లీలో చెప్పాలని పిలుపునిచ్చారు. దొంగ డిక్లరేషన్ చేసిన వారికి బుద్ది చెప్పేలా మూడో సారి కేసీఆర్ ను సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ దానం నాగేందర్ లతో పాటు శాసనమండలి మాజీ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.