- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రాక్టర్లం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు..
పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బిల్లుల కోసమే జూన్ 18న హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు డి. రవీందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలోని శివ బ్యాంక్‌వెట్ హాల్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా బీఏఐ సన్నాహక సమావేశం జరిగింది. సంగారెడ్డి సెంటర్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, "కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. సమస్యల పరిష్కారానికే సభ నిర్వహిస్తున్నాం అని స్పష్టం చేశారు.పెండింగ్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడం, సిమెంట్, ఇనుము, డీజిల్ ధరల పెరుగుదల, జీఎస్టీ భారం వల్ల కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు.
పెద్ద సంఖ్యలో హాజరుకావాలి..
బిల్లుల జాప్యం కారణంగా పలువురు కాంట్రాక్టర్లు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాల మౌలిక సదుపాయాల నిర్మాణంలో కాంట్రాక్టర్ల పాత్ర కీలకమని, ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జూన్ 18న హైదరాబాద్‌లో జరిగే "చలో హైదరాబాద్" కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా పాస్ట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డి.ఎన్.ఎస్. రెడ్డి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బి.ఎన్.ఎస్. రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్. పవన్, రాష్ట్ర ట్రెజరర్ జి. సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు సత్యం, అశోక్, గోవర్ధన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, వీరారెడ్డి, సుధాకర్, మనోజ్, నవీన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జావేద్, వి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






