సేంద్రియ వ్యవసాయంతో ప్రకృతి, పశు సంపద పరిరక్షణ : సేంద్రియ రైతు మల్లేశం

by Aamani |
సేంద్రియ వ్యవసాయంతో ప్రకృతి, పశు సంపద పరిరక్షణ : సేంద్రియ రైతు మల్లేశం
X

దిశ , జహీరాబాద్: సేంద్రియ వ్యవసాయంతో ప్రకృతి, పశుసంపదలు పరిరక్షించబడతాయని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఖాసింపూర్ గ్రామానికి చెందిన సేంద్రియ రైతు మల్లేశం అన్నారు. రాజస్థాన్ లోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విద్యాలయంలోనిర్వహిస్తున్న రైతు సదస్సు వేదిక పై ప్రసంగించే అవకాశం సేంద్రియ రైతు ఖాసింపూర్ మాజీ సర్పంచ్ మల్లేశం కు దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ పద్ధతిలో చేసే వ్యవసాయానికి ప్రకృతి పులకించి పోతుందన్నారు. ఈ సందర్భంగా గోఆధారిత వ్యవసాయంతో ప్రకృతి వ్యవసాయానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. రసాయన ఎరువులు పురుగుమందులతో భూమి ఉత్పాదక శక్తి తగ్గిపోతుందని భూ పరిరక్షణ కోసం గోదారిత వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కు ప్రకృతి వ్యవసాయం ఈ విధంగా తోడ్పడుతుందో వివరించారు. తన పొలంలో పండిస్తున్న వివిధ రకాల కూరగాయలు, కలిపి పంటలు తదితరుల గురించి వివరించారు. ప్రకృతి వినాశనానికి కారణం అవుతున్న ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని వాటితో పర్యావరణానికే కాకుండా మనవాళ్ళకి మనుగడకు కూడా నష్టం ఉందన్నారు.

సేంద్రియ వ్యవసాయంతో పశు సంపద అత్యంత ప్రాధాన్యత ఉందని , దీంతో పంటలు కూడా ఆశించిన స్థాయిలో పెరుగుతాయన్నారు. ప్రకృతి వ్యవసాయంతో నేల సారవంతం పెరిగి తెగుళ్లను నియంత్రించడానికి, కృత్రిమ పురుగుమందులు, కలుపు సంహారకాలు , ఎరువుల వాడకాన్ని పూర్తిగా నివారిస్తుందన్నారు. బదులుగా, ఇది కంపోస్ట్, ఎరువు మరియు కవర్(మల్టీ క్రాప్)పంటల వంటి సహజ ప్రత్యామ్నాయాలపై ఆధారపడుతుందన్నారు. మల్టీ క్రాప్ సాగు చేయడంతో ఓ పంట ఇంకో పంటకు ఏ విధంగా రక్షణ నిస్తుందో వివరించారు. గో ఆధారిత సేంద్రియ వ్యవసాయమే మనవాళ్ళకి ఎంతో మేలు చేస్తుందన్నారు.సేంద్రియ పద్ధతుల్లో తెగుళ్లను నియంత్రించడానికి ప్రయోజనకరమైన కీటకాలు, పక్షులు , ఇతర జీవులు బయోలాజికల్ పెస్ట్ కంట్రోల్ ఉపయోగించబడతాయన్నారు. ప్రకృతికి పర్యావరణానికి వర్ష సంపదకు పశు సంపదకు మానవాళి మనుగడకు ఎంతో ఉపయోగమైన సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed