గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలి

by Kalyani |
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలి
X

దిశ, సంగారెడ్డి : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని, ప్రత్యర్థిపై 3వేల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. ఆదివారం సంగారెడ్డి ధర్మ ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 3 వేల ఓట్ల మెజారిటీ ఉండాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, మాజీ ఎంపీపీ జూలకంటి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, కూన సంతోష్, షఫీ, రఘు గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed