పంట నష్టాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

by Disha Web Desk 1 |
పంట నష్టాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
X

దిశ, చేర్యాల: ఇటీవల భారీ వర్షం, వడగళ్లతో వరి, మామిడి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రైతులకు భరోసా కల్పించారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ జీవన్ పాటిల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు.

రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమగ్ర పంట పరిశీలన చేసిన అనంతరం నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వ పక్షాన నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కత్తుల కృష్ణవేణి, ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, ఏడీఏ రాధిక, ఎంపీటీసీ గూడూరు బాలరాజు, చేర్యాల ఆర్ఐ రాజేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Next Story