చేర్యాల సీఐ శ్రీనివాస్ సస్పెండ్

by Disha Web Desk 12 |
చేర్యాల సీఐ శ్రీనివాస్ సస్పెండ్
X

దిశ, చేర్యాల: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చేర్యాల సీఐ మంచినీళ్ల శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా సిపి శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం చేర్యాల జడ్పిటిసి షెట్టే మల్లేశం హత్య జరిగిన రోజున విధుల్లో లేకపోవడంతో స్థానిక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పోలీస్ స్టేషన్లో దాదాపు గంటన్నరకు పైగా సీఐ శ్రీనివాస్ రాక కోసం ఎదురు చూడగా అందుబాటులో లేకపోవడంతో గతంలో సిఐ శ్రీనివాస్ పై మెమో జారీ చేసిన పోలీస్ అధికారులు.

అయినప్పటికీ ఎలాంటి మార్పు రాకుండా గత నెల 25న పోలీస్ అధికారుల అనుమతి లేకుండా పొరుగు ప్రాంతానికి వెళ్లిన సీఐ శ్రీనివాస్ తిరుగు ప్రయాణంలో విధులకు హాజరయ్యే క్రమంలో మండలంలోని ముస్త్యాల గ్రామ శివారులోని తను ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కావడంతో అసలు విషయం బయటపడింది. అంతే కాకుండా కొంత మంది రియల్టర్స్ వ్యాపారస్తుతో చేతులు కలిపి తన బినామీగా పెట్టుకొకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా మద్దూరు మండలంలోని కొంతమంది బెల్లం స్పటిక వ్యారస్తులతో కుమ్మకై వ్యాపారానికి అడ్డు లేకుండా వ్యవహరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐ శ్రీనివాస్ తీరుపై ఎలాంటి మార్పు రాకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా సీపీ శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సీఐ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలు గడవక ముందే సస్పెండ్ కావడంతో చేర్యాల ప్రాంత ప్రజలు హాట్ టాపిక్ గా చర్చిస్తున్నారు.


Next Story

Most Viewed