- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేంద్ర ప్రభుత్వం ఆదివాసి, అటవీ రక్షణ చట్టాలకు తిలోదకాలిస్తుంది : విమలక్క

దిశ, హుస్నాబాద్ : 100ల సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న ఆదివాసి, అటవీ రక్షణ చట్టాలకు తిలోదకాలిస్తూ అడవులను ఖాళీ చేపిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క అన్నారు. పట్టణంలోని అమరుడు రెక్కల సహదేవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ భారతదేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అడవుల్లోని విలువైన ఖనిజ సంపదను కాపాడుతున్న ఆదివాసి ప్రజలు నక్సలైట్లకు అండగా నిలుస్తున్నారు అని సాకుగా చూపి చంపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ? ప్రజాస్వామిక వాదులు, ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మేకల వీరన్న యాదవ్, ముప్పిడి రాజిరెడ్డి, వినోద్, అరుణోదయ కళాకారులు పాల్గొన్నారు.