ఒకే రోజు రెండు ఇండ్లలో చోరీ

by Kavitha |
ఒకే రోజు రెండు ఇండ్లలో చోరీ
X

దిశ, నిజాంపేట: ఇంటికి తాళం వేసిన రెండు ఇండ్లలో తాళాలు పగలగొట్టి నగలు ఎత్తుకెళ్లిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజాంపేట గ్రామానికి చెందిన రేగుల ఎల్లవ్వ, పంపురి స్వరూప కి చెందిన ఇండ్లకు తాళం వేసి తన బంధువుల ఇంటికి వెళ్ళింది. తిరిగి తన ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలకొట్టి ఉంది. దీంతో ఎవరో దుండగులు ఇంటి తాళం పగలగొట్టారని నిర్ధారించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇరువురికి చెందిన 20 తులాల వెండి, రెండున్నర తులాల బంగారం కొంత నగదు అపహరించినట్లు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..దసరా, బతుకమ్మ సెలవులలో ఎవరైనా బంధువుల వద్దకు వెళితే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed