ధాన్యం కొనుగోలు కేంద్రంలో పక్షపాతం

by Disha Web Desk 12 |
ధాన్యం కొనుగోలు కేంద్రంలో పక్షపాతం
X

దిశ, మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన నారదాసు బాలకృష్ణ, కుక్కల లక్ష్మయ్య, కుక్కల కనుకవ్వ, పైస పోశవ్వ, రైతులు మంగళవారం రోజు ధాన్యం తీసుకువచ్చి తాసిల్దార్ కార్యాలయం ముందు కుప్ప పోసి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా వామపక్ష పార్టీలైన సిపిఎం, కాంగ్రెస్, బీజేవైఎం, మద్దతు తెలిపాయి. రైతులు మాట్లాడుతూ.. మేము కొనుగోలు సెంటర్‌లో ధాన్యం పోసి 40 రోజులు గడుస్తున్న కొనుగోలు చేయడం లేదని, కో-ఆపరేటివ్ సొసైటీ సీఈవో ప్రభుత్వ పార్టీకి తొత్తుగా మారి బీజేపీ పార్టీకి చెందిన రైతుల వడ్లు కొనుగోలు చేయడం లేదని, రైతులు సోమవారం రోజున తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భూపతికి వివరించడం జరిగినదని.. కొనుగోలు సెంటర్‌ను సందర్శించిన తహసీల్దార్ ముందుగా కొనుగోలు చేపిస్తామని చెప్పి.. సెంటర్ నిర్వాహకులతో మాట్లాడిన తర్వాత, మీరు సెంటర్లో ధాన్యం పోయలేదని, మీ ధాన్యం కొనుగోలు చేయడం కుదరదని చెప్పాడని తెలియజేశారు.

సెంటర్‌కు దూరంగా పోసిన వారి వడ్లు కూడా కొనుగోలు చేశారని, మా ధాన్యం మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన వారమని కొనుగోలు చేయడం లేదని తెలిపారు. అందుకే ఈరోజు తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగిందని తెలియజేశారు, రైతులు రెండు గంటలకు పైగా ధర్నా నిర్వహించిన తాసిల్దార్ భూపతి మాత్రం కుర్చీలో నుంచి లేచి బయటికి రాకపోవడంతో, సహనం కోల్పోయిన రైతులు ధాన్యాన్ని తీసుకెళ్లి తాసిల్దార్ రూమ్ లో పోయడం జరిగింది.అప్పుడు స్పందించిన తహసీల్దార్ బయటకు వచ్చి రైతులతో మాట్లాడి మీ ధాన్యాన్ని కొనుగోలు చేపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలేటి యాదగిరి, యామ శ్రీకాంత్, కనక చంద్రం, అఖిల చారి, రైతులు పాల్గొన్నారు.


Next Story