తెలంగాణ పల్లెలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం: Minister Harish Rao

by Disha Web Desk 12 |
తెలంగాణ పల్లెలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం: Minister Harish Rao
X

దిశ, ములుగు : తెలంగాణలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీలో, పల్లెల్లో బస్తీ పల్లె దవాఖానాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య,ఆర్థిక కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామం లోని హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన ఆసుపత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. హంస హోమియోపతి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గర్భిణీల ఆరోగ్య దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పౌష్టికాహారం అందని గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించబోతున్నదని అన్నారు. గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించవచ్చునని హరీశ్ రావు స్పష్టం చేశారు. హంస హోమియో మెడికల్ కాలేజీలో 75 పడకల బోధన ఆసుపత్రి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఆయుష్‌కి మంచి భవిష్యత్ ఉందని.. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సాంప్రదాయ వైద్యానికి రోజు రోజుకీ ప్రాధాన్యత పెరుగుతున్నదని తెలిపారు. ప్రజలు దీనిపై ఆసక్తి చూపుతున్నారుని ప్రాముఖ్యత గుర్తించిన ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. (ఆయుష్) ఆయుర్వేదం, యోగ, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియో ఇందులో దేని ప్రత్యేకత దానిదే అన్నారు. తెలంగాణలో అందరికీ వైద్యం అందించే క్రమంలో బస్తీలో పల్లెల్లో వైద్యం అందించేందుకు బస్తీ, పల్లె దవాఖానాలు కేసీఆర్ నాయకత్వంలో తీసుకొచ్చామని తెలిపారు. పల్లె దవాఖానాలో పని చేసేందుకు ఆయుష్ డాక్టర్లను కూడా మేము రిక్రూట్ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ఇదే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆయుష్ సెక్రటరీ రాజేష్ కు కొటేషన్ కూడా పంపడం జరిగిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి హైద‌రాబాద్‌లో వైద్యం పొందేందుకు హెలికాప్ట‌ర్‌ల‌లో పేషెంట్లు వ‌స్తున్నారని ఆయుష్ వైద్యం పొందేందుకు కూడా ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌లు ఇక్క‌డికి రావాలన్నారు. ఇందుకు అన్ని ఆయుష్ విభాగాలను పటిష్టం చేస్తున్నాదాని నేచ‌ర్ క్యూర్ ఆసుప‌త్రి కోసం రూ. 6 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

సిద్దిపేటలో ప్రారంభించుకున్నట్లే, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో 50 పడకల తో కూడిన ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయని ఇందులో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో పంచకర్మ విధానం ద్వారా వెన్నెముక కీళ్ల సమస్యలు పక్షవాతం వంటి దీర్ఘకాలిక సమస్యలకు చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మెరుగైన వైద్యం తెలంగాణలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రపంచం భారతదేశంలో ఉన్న ఆయుష్ వైద్యం వైపు చూడడం ప్రపంచంలో మంచి ఆయుష్ వైద్యం అందిస్తున్న దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉందని కొనియాడారు. ఇక్కడ ఉండే విద్యార్థులు రేపటి ఆయుష్ వైద్యులుగా సమాజానికి మరింత సేవను అందించేందుకు మంచి ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ లాగా అనవసరపు సి సెక్షన్లు వ్యాప్తి చెందాయని తల్లి బిడ్డ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని అవసరం ఉంటే తప్ప సి సెక్షన్ చేయవద్దని డాక్టర్లను ప్రజలకు ప్రభుత్వం అవగాహన కలిగిస్తుందన్నారు.

అనవసరపు సీ సెక్షన్ చేయడం వల్ల తల్లికి మొదటి గంటలో పాలు రాకపోవడం తో పుట్టే పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం మనం కోల్పోతున్నామని అన్నారు. గర్భిణీల ఆరోగ్య దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం వారికి పోషిక ఆహారం అందని గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించబోతుంది మంత్రి తెలిపారు. గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించవచ్చునని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, హంస హోమియోపతి కళాశాల ఎండీ ఉమేష్ కుమార్, డాక్టర్ అఖిల దేవి, ఏఎంసీ చైర్మన్ జహంగీర్, పిఎసిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, ఏఎంసి వైస్ చైర్మన్ భూపాల్ రెడ్డి, నాయకులు జుబేర్ పాషా, అంజన్ గౌడ్, కొన్యాల బాల్ రెడ్డి, బాపురెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హంస హోమియోపతి వైద్య సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed