బడిబాటను సక్సెస్ చేయాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి

by Kalyani |
బడిబాటను సక్సెస్ చేయాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి
X

దిశ, సదాశివపేట : బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తున్నదని,ఈ కార్యక్రమంలో అధికారులు అందరూ నిబద్ధతతో పని చేయాలని ,బడిబాటను సక్సెస్ చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కోరారు. మండలంలోని బడి ఈడు పిల్లలందరినీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆమె సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆమె మంగళవారం మండల కేంద్రంలోని పి ఎస్ ఎం ఎల్, మండలంలోని కోనాపూర్ గ్రామం లో జరిగిన బడిబాట ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాలైన మౌలిక వసతులు ఉన్న యని ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు ,నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు ,మూత్రశాలలు తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని వాటిని సద్వినియోగపర్చుకోవాలని ఆమె తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉందని ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాలలోనే బోధన జరుగుతుందని వివరించారు. పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్య పొందాలని అన్నారు.

కోనాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. బడిబాట కార్యక్రమంలో ప్రతిరోజు సేకరించిన వివరాలను (వి ఈ ఆర్ )విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ లో పొందుపరచాలని సూచించారు. మరమత్తు పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ కార్యక్రమంలో కోనాపూర్ గ్రామ సర్పంచ్ శోభారాణి సంగమేశ్వర్ కలెక్టర్ ను సన్మానించారు.పి ఎస్ ఎం ఎల్ వార్డ్ కౌన్సిలర్ నాగలక్ష్మి సత్యనారాయణ గౌడ్, జిల్లా ,మండల, గ్రామీణ స్థాయి , పురపాలక సంఘం అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed