- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామచంద్రాపురం డివిజన్‌లో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన..
రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్‌లో మంగళవారం బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

దిశ, రామచంద్రాపురం: భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాజీ మంత్రివర్యులు,హరీష్ రావు ఆదేశాల మేరకు పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్‌లో మంగళవారం బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సూచనల మేరకు డివిజన్ పరిధిలోని ప్రతి బూత్ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి బూత్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగంపై అవగాహన కలిగి ఉండి, పార్టీ సభ్యత్వ నమోదు చేయగల ఇద్దరు యువతతో పాటు సీనియర్ బూత్ కోఆర్డినేటర్‌ను ఎంపిక చేసి ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.
ఓటర్ల వివరాలను పరిశీలించడం ద్వారా..
పటాన్‌చెరు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ప్రజలను చేరుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను పరిశీలించడం ద్వారా డూప్లికేట్ ఓటర్లు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, పరమేష్ యాదవ్, గోవింద్ యాదవ్, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.






