- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మంత్రాల నెపంతో మహిళపై దాడి
by Kavitha |
X
దిశ, నిజాంపేట: మంత్రాలు చేస్తుందని ఓ మహిళపై దాడి చేసిన సంఘటన రామాయంపేట మండల పరిధిలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట మండల పరిధిలోని ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన గుర్రం విజయ (50) అనే మహిళ మంత్రాలు చేస్తుందని కొందరు వ్యక్తులు మహిళపై దాడి చేశారు. విజయ, భర్త సిద్ధ రాములు ఇతరుల ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వేశారని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో గ్రామానికి చెందిన కొంతమంది వారి పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అడ్డు వచ్చిన విజయ కుమారుడికి సైతం గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన విజయను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story