వనపర్తి జిల్లాలో దారుణం...పదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం

by Disha Web Desk 15 |
వనపర్తి జిల్లాలో దారుణం...పదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం
X

దిశ,అమరచింత : అభం శుభం తెలియని ఓ 10 ఏళ్ల బాలికపై 30 ఏళ్ల వయస్సున్న వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నందిమల్ల గ్రామానికి చెందిన రాజు అనే 30 ఏళ్ల వ్యక్తి గురువారం సాయంత్రం మద్యం సేవించాడు. అదే సమయంలో 5వ తరగతి చదువుతున్న బాలిక తన ఇంటికి వెళ్తుండగా మీ నాన్న పిలుస్తున్నాడు రమ్మని మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకుని ఊరి పక్కనే ఉన్న పొలం దగ్గరకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. కొద్ది సేపటికి బాలిక తప్పించుకుని కేకలు వేస్తూ పొలంలో నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు వైపు చేరుకుంది. భయంతో కేకలు వేస్తూ అటుగా వెళ్తున్న వారిని కాపాడాలని కోరింది. స్థానికులు, గ్రామస్తులు బాలికకు రక్షణ కల్పించారు. దీంతో లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తి అక్కడ నుంచి పారిపోయాడు. జరిగిన విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో దాడికి ప్రయత్నించిన వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.



Next Story

Most Viewed