అథ్లెటిక్ మీట్‌కు అంతా రెడీ... ఇక్కడ విజేతలైనవారు జాతీయ స్థాయికి ఎంపిక

by Dishanational1 |
అథ్లెటిక్ మీట్‌కు అంతా రెడీ... ఇక్కడ విజేతలైనవారు జాతీయ స్థాయికి ఎంపిక
X

దిశ, వర్గల్: ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు జరిగే 31వ రీజినల్ స్థాయి అథ్లెటిక్ పోటీలకు వర్గల్ నవోదయ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణం అంత ముస్తాబైంది. ఈ క్రీడా పోటీలు 3 రోజులపాటు జరుగనున్నాయి. ఈ పోటీలలో దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 75 నవోదయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొంటున్నారు. మొత్తం ఎనిమిది క్లస్టరుగా (వరంగల్, చిత్తూరు, పశ్చిమ గోదావరి, డర్వార్, గదగ్, మైసూర్, కొట్టాయం, మలప్పురం) ఏర్పాటై సుమారుగా 500 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. కోచ్ లు, ఉపాధ్యాయులతో కూడిన ఈ బృందాలు బస చేసేందుకు వీలుగా ప్రిన్సిపాల్ రమేష్ రావు ఏర్పాట్లు చేశారు. అథ్లెటిక్ పోటీల నిర్వాహణకు అనుగుణంగా విద్యాలయ ప్రాంగణంలో 400 మీటర్ల ట్రాక్ ను వ్యాయమ ఉపాధ్యాయ బృందం సిద్ధం చేసింది. అదేవిధంగా ఇతర క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లను సైతం మైదానంలో సిద్ధం చేశారు.



క్రీడాంశాలు ఇవే...

నవోదయ విశ్వవిద్యాలయంలో జరగనున్న రీజినల్ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో అథ్లెటిక్ ఈవెంట్లు(100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు) పరుగు పందెంతోపాటు హైజంప్, లాంగ్ జంప్, జావెలిన్, షాట్ ఫుట్ క్రీడాలను నిర్వహించనున్నారు. క్రీడాకారుల్లో అండర్ 14, 17, 19 కేటగిరీలలో పోటీ పడనున్నారు. విజేతలైనవారు జాతీయ స్థాయికి ఎంపికవుతారు. రీజినల్ స్థాయి క్రీడా పోటీలతో పాటు నవోదయ కేంద్రంలో రీజినల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు తయారు చేసిన 125 రకాల సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రదర్శిస్తారు. అందులో నుండి 15 జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు.



ఏర్పాట్లు పూర్తి చేశాం: రమేష్ రావు, ప్రిన్సిపాల్

వర్గల్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో మూడు రోజులపాటు జరిగే క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్గల్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ రమేష్ రావు తెలిపారు. క్రీడోత్సవాల కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మహాత్మా జ్యోతిబాపులే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు, నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ హాజరుకానున్నారని వెల్లడించారు. ముగింపు సమావేశానికి జిల్లా పోలీస్ కమిషనర్ శ్వేతా హాజరవుతారని తెలిపారు.


Next Story

Most Viewed