ప్రశ్నాపత్రం లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి

by Disha Web Desk 1 |
ప్రశ్నాపత్రం లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రశ్నాపత్రం లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్, మెదక్ జిల్లా కన్వీనర్ శశికాంత్, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఆకాష్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీ ఘటనకు నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఎబీవీపీ నాయకులు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై మంత్రి కేటీఆర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషమంలో మంత్రి హరీష్ రావు స్పందించకపోవడం బాధకరమని అన్నారు.

టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రమచంద్రన్ ఎందుకు విచారించడం లేదంటూ ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నగర కార్యదర్శి ఆదిత్య, సిద్దిపేట నగర విస్తారక్ లక్ష్మీపతి, సంజయ్, రాకేష్, ప్రశాంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఎబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Next Story