అర్హులందరిని ఓటరుగా నమోదు చేయాలి: ఎలక్ట్రోల్ పరిశీలకులు డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు

by Disha Web |
అర్హులందరిని ఓటరుగా నమోదు చేయాలి: ఎలక్ట్రోల్ పరిశీలకులు డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు
X

దిశ, నర్సాపూర్: తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలని ఎలక్ట్రోల్ పరిశీలకులు డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు అన్నారు. మంగళవారం నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలోని రెడ్డిపల్లి ఉన్నత పాఠశాల, మెదక్ అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలోని దాయారం పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తో కలిసి సందర్శించారు. మెదక్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఎస్ఎస్ఆర్-2 స్వీప్ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, జెండర్ రేషియో, పీడబ్ల్యూడీ ఓటరు నమోదుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులు బీఎల్వోలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఎలక్ట్రోల్ పరిశీలకులు డాక్టర్ క్రిస్టినా జెడ్.చోంగ్తు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు ఓటర్ నమోదు కోసం వచ్చిన దరఖాస్తులన్నింటిని వెంటనే ఆన్ లైన్ చేయాలని సూచించారు. జాబితా రూపకల్పనలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారం తీసుకొని తప్పులు లేని జాబితా రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎండి నయీమ్, ఎండీ గౌస్ ఖురేషీ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.Next Story

Most Viewed