ఎయిర్ బస్ డ్రైవర్ల నిరసన

by Aamani |
ఎయిర్ బస్ డ్రైవర్ల నిరసన
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎయిర్ బస్ డ్రైవర్ పై దాడిని ఖండిస్తూ సిద్దిపేట బస్సు డిపో వద్ద మంగళవారం ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ సిద్దిపేట డిపో అధ్యక్షుడు రవి మాట్లాడుతూ.. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవాలని డిపో మేనేజర్ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇటీవల బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని కారణంగా డ్రైవర్ దాడికి పాల్పడరాని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిబంధనలకు వ్యతిరేకంగా బస్సుల్లో అత్యధిక ప్రయాణికుల ఎక్కించాలని ఒత్తిడి తీసుకొస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు లింగం, ఖలీల్, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, చందు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story